సౌది యువరాజుగా మోసం, 18 ఏళ్ల జైలు

Anthony Gignac
Anthony Gignac


ఫ్ల్లోరిడా: దాదాపు మూడు దశాబ్దాలుగా సౌదీ అరేబియాకు చెందిన యువరాజుగా చెలామణీ అవుతూ, కోట్ల రూపాయలు దండుకున్నాడు ఫ్లోరిడాకు చెందిన వ్యక్తి. ఆ మోసం బయటపడి 18 ఏళ్లపాటు ఊచలు లెక్కబెట్టాల్సిన పరిస్థితి వచ్చింది.
48 ఏళ్ల ఆంథోని జిగ్నాక్‌ గత మూడు దశాబ్దాలుగా సౌదీ యువరాజు ఖలీద్‌ అల్‌ సౌద్‌నంటూ అందరిని మోసం చేశాడు. ఆయన మియామీ ఫిషర్‌ ద్వీపంలో నివసిస్తూ నకిలీ డిప్లొమాటిక్‌ లైసెన్స్‌ ప్లేట్‌తో ఫెరారీలో తిరిగేవాడు. అతడి చుట్టూ ఉన్న బాడీగార్డులు కూడా నకిలీ పత్రాలు పట్టుకుని ఉండేవారు. తాను డబ్బులు పెట్టుబడి పెడతానని, తనతో చేరానుకునే వారు తన ఖాతాలో డబ్బు జమ చేయాలని నమ్మించి దాదాపు 8 మిలియన్‌ డాలర్ల(రూ. 55,66,36,800)ను జమ చేసుకున్నాడు. ఐతే ఆ డబ్బుతో జల్సారాయుడులా తిరగడం మొదలుపెట్టాడు.
ఇలా దాదాపు మూడు దశాబ్దాల పాటు కొనసాగిన మారువేషం ఓ తప్పిదం కారణంగా బయటపడింది. ముస్లింలు పోర్క్‌ ఉత్పత్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ తమ చెంతకు రానీయరు. ఐతే జిగ్నాక్‌ అది పెద్దగా పట్టించుకోవట్లేదని ఓ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి గుర్తించి, ఆయన బండారం బయటపెట్టాడు. దాంతో జిగ్నాక్‌ను 2017 నవంబరులో పోలీసులు అరెస్టు చేశారు. విచారన అనంతరం 18 ఏళ్లు జైలు శిక్ష పడింది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/