కన్నకొడుకే ఆ తల్లికి కాలయముడు

దుబాయ్‌లో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన

murder
murder

దుబాయ్‌:29 ఏళ్ల వ్యక్తి, అతని భార్య వృద్ధురాలైన తల్లిని శారీరకంగా హింసించడంతో పక్కటెముకలు విరిగి, శరీరంలోపల బ్లీడింగ్‌ అయి, తీవ్రంగా కాలిన గాయాలతో చనిపోయిందని వైద్యపరీక్షల్లో తెలిసింది. దుబాయ్‌ ఈ సంఘటనలో భారత్‌కు చెందిన వ్యక్తి, అతని 28 ఏళ్ల భార్య నిందితులని గుర్తించారు. వృద్ధురాలైన తల్లిని భార్యాభర్తలు దారుణంగా హింసిచారని, కుడి కంటి కనుపాపను కట్‌ చేశారని పక్క కంటిలోని భాగాలు దెబ్బతినేలా బాధించారని, కోర్టు విచారణలో తేలింది. దారుణంగా హింసించి ఆమె చావుకు కారణమైన ఈ సంఘటనపై విచారణ 2018 జూలై నుండి అక్టోబర్‌ వరకు జరిగింది. వృద్ధురాలు చనిపోయినప్పుడు కేవలం 29 కిలోల బరువుందని ఫోరెన్సిక్‌ డాక్టర్‌ పేర్కొన్నాడు.

నిందితులైన భార్యభర్తలను ఎవన్‌ ఖుషాయ్‌ పోలీసులు అదుపులోకి తీసుకుని వారిపై కేసు నమోదు చేశారు. నిందితుల ఇంటికి పక్కన ఉన్న ఒక మహిళతో ఈ విషయం బయటపడింది. ఆమె ఒక ఆసుపత్రిలో పనిచేస్తున్నారు. ఆ మహిళ చెప్పన ప్రకారం వృద్ధురాలు భారత్‌ నుండి వచ్చినప్పటి నుండి ఆరోగ్యం బాగా లేదని చెప్పిందని, తాను డ్యూటీ నుండి వచ్చే వరకు తన కూతురు తన వద్ద ఉంచుకోమందని చెప్పింది. ఆ తరువాత మూడు రోజులకు వృద్ధురాలు పక్కవారి బాల్కనీలో నేలపై పడి ఉందని చెప్పింది. ఆమె శరీరంపై కాలిన గాయాలున్నాయంది. ఈ విషయాన్ని తాను సెక్యురిటీ గార్డుకు చెప్పినట్లు ఆమె చెప్పింది. తాను వారి ఇంటి తలుపు తట్టి వృద్ధురాలిని వెంటనే ఆసుపత్రికి తరలించాలని అంబులెన్స్‌ పిలిచినట్లు చెప్పింది. అపస్మారక స్థితిలో ఉన్న వృద్ధురాలిని పారామెడిక్స్‌ సహాయంతో అంబులెన్స్‌లో ఎక్కించినట్లు చెప్పింది.

వృద్ధురాలు భయంకరమైన నొప్పితో బాధపడుతుందని, ఆమె చేతులు, కాళ్లు తీవ్రంగా వాచిపోయి కాలిన మరకలు ఉన్నాయి. అందుకు ఆమె కొడుకు తనకు తానే వేడినీళ్లు పోసుకోవడం వల్ల కాలిందని చెప్పాడు. ఆమె అంత దీనస్థితిలో ఉంటే కూడా అతను దగ్గరికి కూడా వెళ్లలేదు. దూరంగా నిలుచుని ఉన్నాడు. కనీసం ఆమెను అంబులెన్స్‌లో ఎక్కించేప్పుడు కూడా అతను పట్టించుకోలేదని పొరుగువారే సహాయం చేశారని పారామెడికల్‌ పేర్కొన్నాడు. ఆమెను కొడుకు, కోడలు చాలాసార్లు హించారన్నారు. ఆమె శరీరం 10 శాతం కాలిఉందన్నారు. పక్కటెముకలు విరిగి ఉన్నాయని, శరీరంలోపల రక్తస్రావం అయిందని, వారి నిర్లక్ష్యం వల్లే ఆమె ఆ స్థితికి చేరిందని పరీక్షించిన డాక్టర్‌ చెప్పాడు. వృద్ధురాలి తీవ్రంగా హింసించి ఆమె మృతికి కారణమైన నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/national/