థాయ్‌లాండ్ మాజీ ప్రధాని కన్నుమూత

Tinsulanonda
Tinsulanonda

బ్యాంకాక్‌: థాయ్‌లాండ్ మాజీ ప్రధాని జనరల్‌ ప్రేమ్‌ టిన్సులనోండా (98) ఈరోజు ఉదయం కన్నుమూశారు. ఈ విషయం రాజప్రాసాదం అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు.టిన్సులనోండా 1980 నుంచి 1988 మధ్యకాలంలో మూడు సార్లు ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. 2016లో థాయ్‌లాండ్‌ రాజు భుమిబోల్‌ మృతి చెందిన తర్వాత దేశ పరిపాలనలో కీలక భూమిక పోషించారు. తాజాగా ఇదే నెలలో జరిగిన భుమిబోల్‌ తనయుడు విజయాలంగ్‌కర్న్‌ పట్టాభిషేకం కార్యక్రమంలో ముఖ్య పాత్ర పోషించారు. టిన్సులనోండాప్రస్తుతం మహారాజు సలహాదారుల కమిటీలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.


మరిన్ని తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/