జపాన్‌ కొత్త చక్రవర్తిగా నరూహితో పట్టాభిషేకం

JapanEmperor Naruhito
Japan Emperor Naruhito

టోక్యో: జపాన్‌ కొత్త చక్రవర్తిగా నరూహితో సింహాసనాన్ని అధిష్ఠించారు. 85 ఏళ్ల అకిహితో జపాన్‌ చక్రవర్తిగా వైదొలగడంతో ఆయన కుమారుడు నరూహితో ఈరోజు సింహాసనాన్ని అధిష్ఠించారు. ఈ సందర్భంగా ఆయనకు వారసత్వంగా సంక్రమించే ఖడ్గం, నగలు, రాజముద్రలను అందుకున్నారు. పట్టాభిషేక మహోత్సవం అతి కొద్దిమంది ప్రముఖుల మధ్య జరిగింది. నూతన చక్రవర్తి భార్య సహా రాజవంశానికి చెందిన మహిళలు ఎవరినీ ఈ కార్యక్రమానికి అనుమతించలేదు. తరువాత దేశ ప్రజలను ఉద్దేశించి జపాన్‌ 126వ చక్రవర్తి హోదాలో నరూహితో తొలిసారి ప్రసంగించారు. కొత్త రాజు శకానికి శుభప్రదమైన కాలంగా నామకరణం చేశారు. అక్టోబర్‌ 22న ప్రజల మధ్య కొత్త చక్రవర్తి పట్టాభిషేక మహోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమానికి ప్రపంచ దేశాధినేతలు హాజరై జపాన్‌ కొత్త చక్రవర్తి నరూహితోకు శుభాకాంక్షలు తెలపనున్నారు.


మరిన్ని తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/