రెండు నిమిషాల్లో బిలియన్‌ డాలర్లు నష్టపోయిన ఎలాన్‌ మస్‌!

Elon Musk
Elon Musk

న్యూయార్క్‌: ప్రపంచంలోని అత్యంత సంపన్నుల్లో ఒకరైనా టైకూన్‌, టెస్లా వ్యవస్థాపకుడు ఎలాన్‌ మస్క్‌ తన సంపదలో బిలియన్‌ డాలర్లు కోల్పోయారు. కేవలం రెండు నిమిషాల్లో 1.1 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.7,572 కోట్లు) నష్టపోయారు. న్యూయార్క్‌ఎక్స్ఛేంజీల్లో గురువారం ట్రేడింగ్‌ ఆరంభమైన రెండు నిమిషాలకే అంటే ఉదయం 9.32 గంటలకు టెస్లా షేర్లు 11శాతం నష్టంతో ట్రేడ్‌ అయ్యాయి. దీంతో ఎలన్‌ మస్క్‌ సంపద 1.1 బిలియన్‌ డాలర్లు తగ్గి 22.3 బిలియన్‌ డాలర్లకు పడిపోయింది. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో టెస్లా విక్రయాలు భారీగా తగ్గాయి. గతేడాది నాలుగో త్రైమాసికంలో సంస్థ అమ్మకాలు 90,966 యూనిట్లుగా ఉండగా.. ఈ ఏడాది మార్చితో ముగిసిన త్రైమాసికంలో టెస్లా 63,000 వాహనాలను మాత్రమే విక్రయించింది. దీంతో గురువారం నాటి ట్రేడింగ్‌లో సంస్థ షేర్లు భారీగా పతనమయ్యాయి. నిన్నటి ట్రేడింగ్‌ మొత్తంలో టెస్లా షేర్లు 8శాతం నష్టపోయాయి.


మరిన్ని తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/