ఉగ్రవాదుల దాడి..10 మంది పోలీసులు మృతి

Egyptian soldiers
Egyptian soldiers

ఈజిప్ట్‌: ఈరోజు సినాయీ ద్వీపకల్పంలోని ఓ చెక్‌ పాయింట్‌ వద్ద ఇస్లామిక్‌ ఉగ్రవాదులు దాడికి పాల్పడారు. ఆ దాడిలో 10 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారని అధికారులు మీడియాకు తెలిపారు. మృతి చెందిన వారిలో ఇద్దరు అధికారులు, ఎనిమిది మంది సాధారణ పోలీసులు ఉన్నట్లు వారు నిర్ధరించారు. అయితే రంజాన్‌ సందర్భంగా ఈల్ అరీష్‌ నగరంలో ముస్లింలు ప్రార్థనలు జరుపుతున్న నేపథ్యంలో ఈ దాడికి పాల్పడినట్లు చెప్పారు. చెక్‌ పాయింట్ వద్ద దాడి అనంతరం ఆయుధాలు ఉన్న ఓ వాహనాన్ని తీసుకొని ఉగ్రవాదులు తప్పించుకుపారిపోవాలని ప్రయత్నించారు. అయితే, వెంటనే ఓ యుద్ధ విమానంలో వారిని వెంటాడిన భద్రతా బలగాలు ఐదుగురు ఉగ్రవాదులను హతమార్చాయని అధికారులు తెలిపారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/