ఇండోనేషియాలో భారీ భూకంపం

earthquake in indonesia
earthquake in indonesia

ఇండోనేషియాలో శుక్రవారం ఉదయం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 7.1గా నమోదైందని ఇండోనేషియా అధికారులు తెలిపారు. టెర్నేట్ ద్వీపంలో ఈ భూకంపం వచ్చింది. కాగా దీని కారణంగా అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ఈ భూకంపం వల్ల ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్లు ఇంకా తెలియరాలేదు. అదేవిధంగా నికోబార్ దీవిలో కూడా భూకంపం రావడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. నికోబార్ దీవిలో వచ్చిన భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 5గా నమోదైనట్లు అధికారులు పేర్కొన్నారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/