ఆఫ్గనిస్తాన్‌ హిందూకుష్‌లో భూకంపం

Earthquake
Earthquake

అఫ్గనిస్తాన్ : హిందూకుష్ ప్రాంతంలో శుక్రవారం ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 5.1గా నమోదైందని అధికారులు తెలిపారు. ఒక్కసారిగా భూకంపం రావడంతో భయంతో ప్రజలు రోడ్లపైకి పరుగులు తీశారు. ఈ భూకంపం వల్ల భారీగా ఆస్తినష్టం జరిగినట్టు తెలిసింది. అయితే ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. భూకంప ప్రభావిత ప్రాంతంలో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/