విభేదాలు వివాదాలుగా మారకూడదు

చైనాలో మూడు రోజుల పర్యటన
కశ్మీర్ అంశం ప్రస్తావించని చైనా

EAM Jaishankar Meets China Vice President
EAM Jaishankar Meets China Vice President

బీజింగ్ : విభేదాలు వివాదాలుగా మారకూడదని భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కోరారు. చైనాలో మూడు రోజుల కీలక అధికారిక పర్యటనకు ఆయన సోమవారం ఇక్కడికి చేరుకున్నారు. భారత్ చైనాల మధ్య కొన్ని అంశాలపై ఉండే విభేదాలు తీవ్రస్థాయి వివాదాలు కాకూడదని, ఇదే భారత్ అభిమతమని ఆయన తెలిపారు. కశ్మీర్‌పై భారత ప్రభుత్వ కీలక నిర్ణఁం తరువాత తొలిసారిగా విదేశాంగ మంత్రి జై శంకర్ చైనాలో పర్యటిస్తున్నారు. ఆయన తొలుత చైనా ఉపాధ్యక్షులు వాంగ్ క్విషాన్‌ను కలుసుకున్నారు. చైనా అధ్యక్షులు జి జిన్‌పింగ్‌కు క్విషాన్ అత్యంత నమ్మకస్తులు. ఆయనతో కీలక విషయాలు చర్చించిన తరువాత పరిమిత ప్రతినిధి బృందంతో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో జై శంకర్ సమావేశం అయ్యారు.

కశ్మీర్ పరిణామాలతో భారత్ పాకిస్థాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను చైనా జాగ్రత్తగా గమనిస్తోందని అధికార వర్గాలు తెలిపాయి. ఈ ప్రాంతంలో శాంతి సుస్థిరతలకు భారతదేశం నిర్మాణాత్మక పాత్ర పోషించాలని చైనా ఆశిస్తున్నట్లు వెల్లడించారు. భారత విదేశాంగ మంత్రికి చైనా విదేశాంగ మంత్రి సాదర స్వాగతం పలికారు. భారత్ పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల విషయాన్ని నేరుగా ప్రస్తావించారు. కానీ కశ్మీర్ గురించి కానీ ఆర్టికల్ 370 రద్దు గురించి కానీ ప్రత్యక్షంగా పేర్కొనలేదు. శాంతియుత సహజీవనానికి ప్రాతిపదిక అయిన ఐదు సూత్రాలకు అనుగుణంగా భారత్ చైనాలు పరస్పర లాభదాయక సహకారానికి ముందుకు సాగాల్సి ఉంని వాంగ్ చెప్పారు. ఇరు దేశాల ప్రజల దీర్ఘకాలిక ప్రయోజనాలు, మౌలిక ప్రాధాన్యతాక్రమాలు అంతకు మించి ప్రపంచ శాంతి దిశలో , మానవీయ పురెగతి బాటలో పరస్పర సహకారం కీలకం అని చైనా పేర్కొంది. ఇక రెండు అతి పెద్ద దేశాలుగా ప్రాంతీయ శాంతి సుస్థిరతల పరిరక్షణలో భారత్ చైనాలపై గురుతర బాధ్యత ఉందని చైనా విదేశాంగ మంత్రి సూచించారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/