సౌదీ ఆరామ్‌కో సంస్థపై డ్రోన్‌ దాడి

drone
drone


దుబా§్‌ు: సౌదీ అరేబియాలోని ప్రధాన చమురు గనుల వద్ద డ్రోన్‌ దాడితో మంటలు లేచాయని ఆ దేశ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖ ప్రకటించింది. డ్రోన్‌ దాడి ఎవరు చేశారనేది తెలియలేదు. అయితే యెమెన్‌కు చెందిన హౌతి తిరుగుబాటుదారులు పనే అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఖురియాస్‌ చమురు నిక్షేపాలలోని బక్‌యాక్‌ ప్లాంట్‌లో జరిగిన ఈ దాడిలో ఎవరైనా గాయపడ్డారా అన్నది ఇంకా స్పష్టం కాలేదన్నారు. బక్‌యాక్‌ వెనుకభాగంల తుపాకి పేల్చిన శబ్దం వచ్చినట్లు ఆన్‌లైన్‌ వీడియోలో ఉందని, దట్టమైన పొగ అలుముకుని ఆకాశానిగెగిసిన మంటలతో ఆ ప్రాంతమంతా నిండిపోయిందన్నారు. భారీ ఎత్తున ఎగిసిన మంటలు డ్రోన్‌ వల్లేనని అంతర్గత మంత్రివర్గం ఒక నివేదికలో చెప్పింది. అరామ్‌కో కంపెనీ వెంటనే స్పందించలేదు. బక్‌యాక్‌లోని ఈ చమురుశుద్ధి కర్మాగారం ప్రపంచంలోనే పెద్దిది. క్రూడాయిల్‌ను భారీ ఎత్తున శుద్ధిచేసి పర్షియన్‌ గల్ఫ్‌, రెడ్‌ సిలకు రవాణా చేస్తుంది. ఈ ప్లాంట్‌ ఒక రోజుకు 7 మిలియన్‌ బారెల్ల క్రూడాయిల్‌ను శుద్ధి చేస్తుందన్నారు. ఈ ప్లాంట్‌పై గతంలో ఉగ్రవాదులు దాడి చేశారన్నారు. 2006 ఫిబ్రవరిలో ఆల్‌ఖైదా ఆత్మాహుతి దాడులు జరిపి విఫలమైందన్నారు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/news/international-news/