విమానాశ్రయంలో డ్రోన్లు

hitro airport
hitro airport


న్యూఢిల్లీ: లండన్‌లోని హిత్రో విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు అంతరం కలిగించేందుకు ఆందోళన కారులు గత కొన్ని రోజులుగా విమానాశ్రయం రన్‌వే పైకి డ్రోన్లను పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఆందోళన కారులు గతంలో పర్యావరణ పరిరక్షణకు లండన్‌ వీధులను స్తంభింబ చేశారు. అయితే జామర్ల ద్వారా వారి ప్రయత్నాలను బ్రిటిష్‌ పోలీసులు అడ్డుకుని ఒక మహిళ సహా ముగ్గురు ఆందోళన కారులను అరెస్టు చేశారు. డ్రోన్లను ఎగురవేస్తున్న వీడియో విడుదల కావడంతో అప్రమత్తమైన పోలీసులు ఆందోళన కారుల ప్రయత్నాలను ప్రారంభంలోనే అడ్డుకున్నారు. డ్రోన్లు ఎగరవేసే ఆందోళనలో 35 మంది కార్యకర్తలున్నట్లు చెబుతున్నారు. అయితే దీనిలో అయిదారుగురికి మించి ఉండరని పోలీసులు చెబుతున్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి…https://www.vaartha.com/news/international-news/