అమెరికా మార్కెట్లోకి డాక్టర్‌ రెడ్డీస్‌ కొత్త ఔషధం

dr-reddys
dr-reddys

వాషింగ్టన్‌: కుంగుబాటు రుగ్మతుల చికిత్స, పొగతాగడాన్ని నివారించడానికి వినియోగించే బుప్రొపైయాన్‌ హైడ్రోక్లోరైడ్‌ ఎక్స్‌టెండెడ్‌ రిలీజ్‌ జనరిక్‌ ఔషధాన్ని అమెరికా మార్కెట్లోకి డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ విడుదల చేసింది. జీబన్‌ బ్రాండెడ్‌ ఔషధానికి ఇది జనరిక్‌ వెర్షన్‌. కంపెనీ విడుదల చేసిన టాబ్లెట్లు 150 ఎంజీ మోతాదులో లభిస్తాయి. ఒక బాటిల్‌లో 60 టాబ్లెబ్లు ఉంటాయి. 2019 జూన్‌ తో ముగిసిన ఏడాదికి యూఎస్‌లో జీబన్‌ విక్రయాలు 54 లక్షల డాలర్లు ఉంది.


తాజా జాతీయ వార్తల క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/