అమెరికా మార్కెట్లోకి డాక్టర్‌ రెడ్డీస్‌ ఔషధం

dr-reddys
dr-reddys

వాషింగ్టన్‌: డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ అమెరికా విపణిలో డెఫెరసిరాక్స్‌ ఫిల్మ్‌ కోటెడ్‌ ట్యాబ్లెట్‌ను విడుదల చేసింది. ఇది నొవార్టిస్‌ ఏజీ అనే బహుళ జాతి సంస్థ విక్రయిస్తున్న ఎగ్జేడ్‌ ట్యాబ్లెట్‌కి జనరిక్‌ ఔషధం. ఇక్వియా హెల్త్‌ గణాంకాల ప్రకారం ఈ ఔషధానికి అమెరికాలో గత ఏడాది కాలంలో దాదాపు 113 మిలియన్‌ డాలర్ల అమ్మకాలు నమోదయ్యాయి. క్రానిక్‌ ఐరన్‌ ఓవర్‌లోడ్‌ లక్షణాలతో బాధపడే వారికి ఈ ఔషధాన్ని వినియోగిస్తున్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/