ఎవరెన్ని కుట్రలు పన్నినా.. గెలిచేది నేనే

ఫాక్స్‌ మీడియా సంస్థపై డొనాల్డ్‌ ట్రంప్‌ ఆగ్రహం

trump
trump

వాషింగ్టన్‌: ఫాక్స్‌ మీడియా సంస్థపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. అభిశంసన అంశానికి సంబంధించి ఫాక్స్‌ మీడియా సంస్థ చేపడుతున్న సర్వేలన్నీ తప్పుడు సర్వేలని విమర్శించారు. ప్రజల నుంచి లభిస్తున్న విశేష ఆధరణను దెబ్బతీయాలని ఫాక్స్‌ మీడియా సంస్థ ప్రయత్నిస్తోందన్నారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా వచ్చే ఏడాది జరుగనున్న అధ్యక్ష ఎన్నికల్లో తాను గెలుపొందుతానని ధీమా వ్యక్తం చేశారు. కాగా, ఈనెల 6 నుంచి 8 తేదీల్లో ట్రంప్‌పై అభిశంసన అంశంపై ఫాక్స్‌ మీడియా సంస్థ సర్వే చేపట్టింది. 800 మంది అభిప్రాయాలను సేకరించినట్టు తెలిపింది. ట్రంప్‌ను పదవీచుత్యున్ని చేయాలని 51శాతం మంది అమెరికన్లు భావిస్తున్నారని ఫాక్స్‌ మీడియా సంస్థ ప్రచురించిన కథనంపై విమర్శలు వెల్లువెత్తాయి.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/