జపాన్‌ పర్యటనలో డొనల్డ్‌ ట్రంప్‌

US President Donald Trump , Japanese PM Shinzo Abe
US President Donald Trump , Japanese PM Shinzo Abe

టోక్యో: అమెరికా అధ్యక్షుడు డోనల్డ్‌ ట్రంప్‌ ప్రస్తుతం జపాన్‌ నాలుగు రోజుల పర్యటనలో ఉన్నారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై సంతకాలు జరిగాయి.ఈ సందర్భంగా ఉత్తరకొరియా తీరుపై ట్రంప్‌ ట్విటర్‌లో స్పందించారు. ఉత్తరకొరియా కొన్ని చిన్నపాటి ఆయుధాలను పరీక్షించింది. దీనివల్ల మా వాళ్లతో పాటు ఇతరులు కూడా కలత చెందారు. కానీ, నేను భయపడలేదు. నాకు ఇచ్చిన మాటపై కిమ్‌ జోంగ్‌ ఉన్ నిలబడతారన్న నమ్మకం నాకు ఉంది అని ఆదివారం పేర్కొన్నారు. కాగా, ఉత్తరకొరియా పరీక్షించిన క్షిపణులపై ఇటీవల జపాన్‌ ప్రధాని అబే స్పందిస్తూ.. చాలా విచారకరమైన చర్య అంటూ వాటిని ఖండించారు. జపాన్‌తో వాణిజ్య సత్సంబంధాలను మెరుగు పర్చుకోవడంతో పాటు ఉత్తరకొరియా చర్యలపై కూడా ట్రంప్‌ చర్చించనున్నట్లు తెలుస్తోంది.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/