ట్రంప్‌ సహాయకురాలికి ఉద్వాసన!

trump- Madeleine
trump- Madeleine

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వ్యక్తిగత సహాయకురాలైన మడేలీన్‌ వెస్టర్‌హౌట్‌ను పదవి నుంచి తొలగిస్తున్నట్టు వైట్‌హౌస్‌ ప్రకటించింది. ఆమె ఇకపై వైట్‌హౌస్‌లోకి అడుగుపెట్టడానికి వీల్లేదంటూ ఆదేశాలు జారీ చేసింది. కాగా, అధ్యక్ష కార్యాలయానికి సంబంధించిన కీలక సమాచారాన్ని మడేలీన్‌ బహిర్గతం చేసిన ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. అంతేగాకుండా, ఓ ప్రెస్‌మీట్‌లో ట్రంప్‌ కుటుంబ సభ్యులకు సంబంధించిన కీలక సమాచారాన్ని లీక్‌ చేశారు. దీంతో, ఆమెపై వేటు పడినట్టు వైట్‌హౌస్‌ ప్రకటిచింది.
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్‌ 2016లో బధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి ట్రంప్‌ వ్యక్తిగత సహాయకురాలిగా ఆమె పనిచేస్తున్నారు. మడేలీస్‌ పనితీరుపై ట్రంప్‌ అనేక సందర్భాల్లో ప్రశంసలు కురిపించారు. మడేలీస్‌ను పదవి నుంచి తొలగించడం పట్ల ప్రతిపక్ష పార్టీ నేతలతో పాటు రిపబిక్లన్‌ పార్టీ నేతలు కూడా ఒకింత విస్మయానికి గురవుతున్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/