జపాన్‌ కొత్త చక్రవర్తి కలిసిన ట్రంప్‌

Japan new emperor naruhito , Donald-Trump
Japan new emperor naruhito , Donald-Trump

టోక్యో: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ జపాన్‌ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన జపాన్‌ నూతన చక్రవర్తి నరూహిటోనే ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. సతీమణి మెలానియా ట్రంప్‌తో కలిసి ఇంపీరియల్‌ ప్యాలెస్‌కు చేరుకున్న ట్రంప్‌కు రెడ్‌కార్పెట్‌పై స్వాగతం లభించింది. ట్రంప్‌ దంపతులకు సాదర స్వాగతం పలికిన నరూహిటో దంపతులు అనంతరం వారితో సమావేశయ్యారు. అయితే చక్రవర్తి పీఠాన్ని నరూహిటో అధిష్ఠించిన అనంతరం ఆయనను తొలిసారిగా కలుసుకున్న అంతర్జాతీయ నేతగా గుర్తుంపు తెచ్చుకున్నారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/