అమెరికా ప్రజలకు డోనాల్డ్ ట్రంప్ విజ్ఞప్తి

సరకుల కొరత రాదు, నిల్వ చేయకండి

trump
trump

వాషింగ్టన్‌: కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పంపిణీ వ్యవస్థ అమెరికాకు ఉందని, నిత్యావసరాల కొరత ఏర్పడుతుందని భయపడవద్దని, ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేసిందని ..సరకులు నిలవ చేసుకుంటేనే కొరత ఏర్పడుతుందని ఆయన అన్నారు. కరోనా భయంతో అమెరికాలో ప్రజలు నిత్యావసర వస్తువుల దుకాణాలకు పరుగులు తీస్తున్నారు. అవసరం ఉన్నా లేకున్నా ఎక్కువ మొత్తంలో సరకులు కొంటుండడంతో అధ్యక్షుడు ఈ హామీ ఇచ్చారు. జనం ఎక్కువ సరకులు కొనడంతో దుకాణాల్లో సరకులు వేగంగా అయిపోతున్నాయి. దుకాణాల్లో నిల్వలు ఖాళీ అయిన చిత్రాల్ని , విజువల్స్ నుఅమెరికా ప్రధాన మీడియా, వార్తా పత్రికలు, ఛానళ్లు చూపించాయి. సరకులు నిండుకోవడంతో ఇటలీ, స్పెయిన్ వంటి యూరోపియన్ దేశాల్లో దుకాణాలు మూతబడిన విజువల్స్ చూసి అమెరికన్లలో ఆందోళన, ఆతృత నెలకొన్నాయి. కొన్ని వారాలకు సరిపడా నిత్యావసరాలు నిల్వ చేయాలనుకుంటున్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/