చైనాలో బీభత్సం…49 మంది మృతి

లెకిమా టైఫూన్ బీభత్సం…

Typhoon Lekima in China
Typhoon Lekima in China

బీజింగ్: చైనాలో లెకిమా టైఫూన్ బీభత్సం సృష్టించింది. టైఫూన్ ధాటికి 49 మృతి చెందగా 21 మంది గల్లంతయ్యారు. ఝిజయాంగ్ అనే ప్రాంతంలో టైఫూన్ ధాటికి అతలాకుతలమైంది. భారీగా వర్షాలు కురుస్తుండగా నదులు, వాగులు వంకలు ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తున్నారు. టైఫూన్ ధాటికి ఇండ్లు కూలిపోవడంతో పాటు కొండ చరియలు విరిగిపడ్డాయి. లోతట్టు ప్రాంతాలలో ఉన్న 12 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ టైపూన్ 66 లక్షల మందిపై ప్రభావం చూపుతోంది. మృతుల సంఖ్య వందలలో ఉంటుందని స్థానిక మీడియా వెల్లడించింది. గల్లంతైన వారి సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఝిజయాంగ్ ప్రజలు వాపోతున్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/