విశ్వ‌స‌నీయ వాతావ‌ర‌ణంతోనే చ‌ర్చ‌లు సాధ్యం

modi, imran khan
modi, imran khan

న్యూఢిల్లీః రెండుదేశాల మ‌ధ్య‌ శాంతి చ‌ర్చ‌లు జ‌ర‌గాల‌ని ఇటీవ‌ల పాకిస్థాన్ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్‌.. భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోదీకి లేఖ రాశారు. ఆ లేఖ‌కు మోదీ స్పందించారు. ఉగ్ర‌వాదంపై ఉక్కుపాదం మోపితేనే.. చ‌ర్చ‌లు సాధ్యం అవుతుంద‌ని మోదీ పాక్‌కు రాసిన లేఖ‌లో స్పష్టం చేశారు. చ‌ర్చ‌లు జ‌ర‌గాలంటే ఈ నిబంధ‌న అవ‌స‌రం అన్నారు. విశ్వ‌స‌నీయ‌మైన వాతావ‌ర‌ణాన్ని క‌ల్పించాల‌ని, ఉగ్ర‌వాదం ఉండ‌కూడ‌ద‌ని, హింస లేని ప‌రిస్థితుల్లోనే చ‌ర్చ‌లు సాధ్యం అవుతాయ‌ని మోదీ త‌న లేఖ‌లో ఇమ్రాన్‌కు త‌న లేఖ‌లో ఈ విష‌యాన్ని చెప్పిన‌ట్లు విదేశాంగ శాఖ వెల్ల‌డించింది.

తాజా వార్త‌ల‌ కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/latest-news/