కువైట్‌లో‌ గత 24 గంటల్లో 1054 కొత్త కేసులు

corona virus
corona virus

కువైట్‌: కువైట్‌లోనూ కరోనా వైరస్ కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 1054 కరోనా కేసులు నమోదైనట్లు కువైట్ ప్రభుత్వం ప్రకటించింది. కువైట్‌లో ఇప్పటి వరకు దాదాపు 30వేల మంది కరోనా బారినపడగా.. 18,277 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. సుమారు 236 మంది కరోనా వైరస్‌తో మృతిచెందారు. మరోవైపు అగ్రరాజ్యంలో కరోనా బారినపడిన వారి సంఖ్య 19.24లక్షలకు చేరగా.. మరణాల సంక్య 1.10లక్షలకు చేరింది. కరోనా కేసులు, మరణాల సంఖ్యలో అమెరికా అగ్రస్థానంలో ఉంది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/