డ్రైవ్-త్రూ వేడుక : కారులోనే పెళ్లిళ్లు

బ్రెజిల్‌లో పాపులర్‌

couples marry at drive-thru ceremonies
couples marry at drive-thru ceremonies

‘డ్రైవ్-త్రూ’ వివాహ వేడుక… ప్రస్తుతం ఇలాంటి పెళ్లిళ్లు.. నిమిషాల్లో జరిగిపోతున్నాయి..

ఈ ట్రెండ్‌ బ్రెజిల్‌లో పాపులర్‌ అయ్యింది. 5 నిమిషాల్లో బ్రెజిల్‌కు చెందిన జోవా బ్లాంక్‌, ఎరికా బ్లాంక్‌లు అనే జంట ఏకమైంది.

కారులో వచ్చిన ఆ జంట ముందుగా ప్రమాణాలను చదివారు.. ఉంగరాలను మార్చుకున్నారు.. తరువాత మాస్క్‌తోనే ముద్దు పెట్టుకుని పెళ్లి అనే బంధంతో ఏకం అయ్యారు.

పెళ్లి పూర్త యినట్టే.. వెంటనే అధికారులు వారికి వివాహ ధ్రువీకరణ పత్రం ఇస్తారు.. తరువాత ఆ కారు వెళ్లిపోతుంది. మరో కారు మరో జంటతో వస్తుంది..

ఇలా 5 నిమిషాల్లో జంటలు ఏకం అవుతూనే ఉంటాయి.

డ్రైవ్-త్రూ వివాహ వేడుకవైపు ఎక్కువగా ఆకర్షితులు అవుతున్నారని తెలిసింది.

కరోనా వైరస్‌ను అరికడుతూనే.. ఏకం అయ్యేందుకు ఇది మంచి మార్గమని నవ దంపతులు అభిప్రా యపడ్డారు. కొన్ని చోట్ల వీడియో కాన్పరెన్స్‌ ద్వారా.. మరికొన్ని చోట్ల ఇలా డ్రైవ్-త్రూ పద్ధతిలో పెళ్లిళ్లు జరగటం విశేషం.

తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/