ఇరాన్‌ మంత్రికి సోకిన కోవిడ్‌-19

స్వయంగా వెల్లడించిన డిప్యూటీ హెల్త్‌ మినిస్టర్‌

Iraj Harirchi
Iraj Harirchi

ఇరాన్‌: తనకు కరోనా వైరస్ సోకిందంటూ ఇరాన్ డిప్యూటీ హెల్త్ మినిస్టర్ హరిర్చి స్వయంగా ప్రకటించారు. తనకు కరోనా సోకిదంటూ హరిర్చి అధికారికంగా ప్రకటించారు. సోమవారం రాత్రి తనకు జ్వరం వచ్చిందని… అర్ధరాత్రి తనకు చేసిన వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని తేలిందని ఆయన చెప్పారు. అప్పటి నుంచి తనకు తానుగా ఒక ప్రాంతంలో ఒంటరిగా ఉంటున్నానని తెలిపారు. ఇప్పుడు తాను ధ్యానం చేస్తున్నానని చెప్పారు. రానున్న కొన్ని వారాల్లో ఈ వైరస్ పై మనం విజయం సాధిస్తామనే విషయాన్ని మాత్రం కచ్చితంగా చెప్పగలనని అన్నారు. ఈ వైరస్ చాలా ప్రమాదకారి అని… ఇరాన్ ప్రజలంతా చాలా అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్బంగా హెచ్చరించారు.
మరోవైపు, ఇప్పటి వరకు దేశంలో కరోనా బారిన పడి 15 మంది చనిపోయారని, 95 మందికి ఈ వైరస్ సోకిందని ఇరాన్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/