దౌత్య సిబ్బందిని వెనక్కి పిలిచిన అమెరికా

America
America

వాషింగ్టన్‌: అమెరికా-ఇరాన్‌ల మధ్య ఘర్షణలు రోజురోజుకి మరింతగా పెరుగుతున్నాయి అయితే ఇరాన్‌పై అమెరికా విధించిన ఆర్థిక ఆంక్షలు సైనిక దాడులకు చర్యలకు దారి తీస్తున్నాయి. దీంతో ఇరాన్‌ దాడులకు రావచ్చనే అనుమానంతో ఇరాక్‌లోని దౌత్య కార్యాలయ సిబ్బందిని విదేశాంగ శాఖ వెనక్కి రప్పిస్తోంది. ఇరాక్‌ రాజధాని బాగ్దాద్‌ రాయబార కార్యాలయం, ఎర్బిల్‌లోని కాన్సులేట్‌ కార్యాలయంలోని అత్యవసర సేవల్లో ఉండే సిబ్బంది మినహా ఇతర ఉద్యోగులంతా అమెరికాకు తిరిగి రావాలని ఆదేశించింది. ఇరాక్‌లోని దక్షిణ ప్రాంతంలో షియా ముస్లింలు అధిక సంఖ్యలో ఉండగా, వారిపై ఇరాన్‌లోని షియా ముస్లిం మత పెద్దల ప్రభావం అధికంగా ఉంది. పరిస్థితిని గమనించిన అమెరికా విదేశాంగ శాఖ మంత్రి మైక్‌ పాంపియో గత వారం ఇరాక్‌ వెళ్లి అధ్యక్షుడు, ప్రధానమంత్రి, ఇతరులను కలిశారు. దౌత్య సిబ్బందిని కాపాడుకోవడం తమకు ప్రాధాన్య అంశమని చెప్పారు.


మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/