బ్రెజిల్‌లో ఖైదీల మధ్య ఘర్షణ..15 మంది మృతి

Jail
Jail

సావోపాల్‌: బ్రెజిల్‌లోని అమెజోనాస్‌ రాష్ట్రంలో గల ఓ జైలో ఖైదీల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో 15 మంది మృతిచెందారు. అయితే ఆదివారం ఉదయం 11 గంటలకు విజిటింగ్‌ అవర్స్‌ సమయంలో ఖైదీల మధ్య ఘర్షణ జరిగింది. అది కాస్త ఉద్రిక్తంగా మారింది. ఖైదీలు పదునుగా ఉండే టూత్‌బ్రష్‌లతో పరస్పరం దాడి చేసుకున్నారు. కొందరిని గొంతు నులిమి చంపేశారు. ఈ ఘటనలో 15 మంది మృతిచెందారని అధికారులు తెలిపారు. ఘర్షణకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/