చైనా బిలియనీర్‌ కు భారీ జరిమానా

చైనా ప్రభుత్వంపై రెన్ జికియాంగ్ విమర్శలు

Chinese tycoon and Xi critic jailed for 18 years for corruption

బీజింగ్‌: చైనాకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి, బిలియనీర్ రెన్ జికియాంగ్ (69) కు మరోసారి భారీ ఎదురు దెబ్బ తగిలింది. కరోనా వైరస్ మహమ్మారి నిర్వహణలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ సర్కార్ విఫలమైందంటూ బహిరంగంగా విమర్శించిన ప్రభుత్వ యాజమాన్యంలోని రియల్ ఎస్టేట్ కంపెనీ మాజీ చైర్మన్ రెన్‌కు అవినీతి ఆరోపణలపై 18 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. పలు ఆరోపణలపై రెన్‌ను బీజింగ్‌లోని ఒక న్యాయస్థానం మంగళవారం దోషిగా తేల్చింది. ముఖ్యంగా సుమారు 16.3 మిలియన్ల డాలర్ల (110.6 మిలియన్ యువాన్లు) ప్రజా నిధుల అక్రమాలు, లంచాలు, అధికార దుర్వినియోగం లాంటి ఆరోపణలను విచారించిన కోర్టు జైలు శిక్షతోపాటు, 620,000 డాలర్ల (4.2 మిలియన్ యువాన్లు) జరిమానా కూడా విధించింది. అంతేకాదు రెన్‌ అక్రమసంపాదను ప్రభుత్వానికి స్వాధీనం చేయడంతోపాటు, తన నేరాలన్నింటినీ స్వచ్ఛందంగా అంగీకరించాడని కోర్టు తెలిపింది.

తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/