చైనా రెండు కొత్త యుద్ద నౌకల జలప్రవేశం

China  missile

China warships

చైనా: చైనా ఈరోజు తాజాగా రెండు కొత్త యుద్ద నౌకలను జనప్రవేశం చేయించింది. దీంతో చైనా నౌకాదళం తన సామార్ధ్యాన్ని మరంంత పెంచుకుంది. 052డీ గైడెడ్ మిస్సైల్ డెస్ట్రాయ‌ర్ల‌ను తీర ప్రాంత‌మైన దాలియ‌న్‌లో జ‌ల‌ప్ర‌వేశం చేశారు. శ‌ర‌వేగంగా మ‌రికొన్ని గైడెడ్ మిస్సైల్ డెస్ట్రాయ‌ర్ల‌ను త‌యారు చేయ‌నున్న‌ట్లు కూడా ఆ దేశం వెల్ల‌డించింది. క్షిప‌ణ విధ్వంస‌క నౌక‌లు.. చాలా వేగంగా దూసుకెళ్ల‌గ‌ల‌వు. ఈ నౌక‌ల నుంచి యుద్ధ విమానాల‌ను కూడా న‌డ‌ప‌వ‌చ్చు. ప్ర‌పంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నౌకాద‌ళంలో చైనా మొద‌టిసాన్థంలో ఉన్న‌ది. ఈ క్షిప‌ణి విధ్వంస‌క నౌక‌ల రాక‌తో చైనా వ‌ద్ద ఉన్న యుద్ధ నౌక‌ల సంఖ్య 20కి చేరుకున్న‌ది.


మరిన్ని తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/