భారీగా పతనమైన చైనా జననాల రేటు!

Chinese
Chinese

బీజింగ్ : చైనాలో గత ఏడాది జననాల రేటు కనీవినీ ఎరగని రీతిలో అత్యంత తక్కువ స్థాయికి పతనమైంది. 1949లో కమ్యూనిస్ట్ చైనా ఆవిర్భావం తర్వాత జననాలు ఇంతగా పడిపోవడం ఇదే మొదటిసారి. దేశంలో వృద్ధుల పెరుగుదల, శ్రామికశక్తి కుంచించుకుపోవడం ఆర్థిక మాంద్యానికి దారితీస్తుందనే ఆందోళన నెలకొంది. జనాభా తగ్గుదల సంక్షోభాన్ని నివారించేందుకు 2016లో చైనా ప్రభుత్వం ఖఒకే బిడ్డగ నిబంధనను సడలించి, ఇద్దరు పిల్లల్ని కలిగి ఉండేందుకు అనుమతిచ్చింది. నిబంధన సడలించినా గర్భధారణలు పెరగడానికి అది దోహదం చేయలేదు. 2019లో వెయ్యి మందికి 10.48 జననాలుండేవి. అంతకు ముందు ఏడాదికన్నా కొంచెం తగ్గుదల కనిపించిందని శుక్రవారం విడుదలైన జాతీయ గణాంకాల సంస్థ (నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ ఎన్‌బిఎస్) విడుదల చేసిన ప్రకటన పేర్కొంది. వరసగా మూడేళ్లుగా జననాల రేటు పతనమవుతోంది. 2019లో 14.65 మిలియన్ బిడ్డలు పుట్టారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/