అమెరికాకు దీటుగా జవాబిస్తాం

trump, jinping
trump, jinping

వాషింగ్టన్‌: అమెరికా చైనాపై ఏకపక్షంగా ప్రారంభించిన వాణిజ్య యుద్ధానికి మరింత ఆజ్యం పోసింది. దీనికి చైనా కూడా తీవ్రంగానే స్పందించింది. దీంతో ఈ వాణిజ్య యుద్ధం ఓ అంతులేని కథగా మారిపోయింది. ట్రంప్‌ సర్కారు కూడా దాదాపు 125 లక్షల కోట్ల డాలర్లకు పైగా విలువైన చైనా దిగుమతులపై విధించిన 15 శాతం సుంకాలను అమలులోకి తెస్తున్నట్లు ప్రకటించారు. దీనికి ప్రతిగా చైనా అమెరికా నుండి దిగుమతి అయ్యే క్రూడాయిల్‌పై 5 శాతం దిగుమతి సుంకం విధించింది. ఈ పెంపుదల కూడా అమలులోకి వస్తుందని తెలిపింది. ప్రపంచంలో రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య వాణిజ్య పోరు ఈ రెండు దేశాలకే గాక, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపైనా తీవ్ర ప్రభావం చూపుతుంది. చైనా నుండి దిగుమతి చేసుకుంటున్న స్మార్ట్‌ స్పీకర్లు, బ్లూటూత్‌ హెడ్‌ఫోన్స్‌, రక రకాలపై పాదరక్షలు వంటి వాటిపై అమెరికా సుంకాల మోత మోగించింది.
చైనా విధించిన అదనపు టారిఫ్‌లలో అమెరికా నుండి దిగుమతి అయ్యే మొత్తం 5,078 రకాల ఉత్పత్తులతో ప్రస్తుతం 1,717 ఉత్పత్తులపై 5 నుండి పది శాతం మేర సుంకాలను వసూలు చేస్తారు. మిగిలిన వాటిపై డిసెంబర్‌ 15 నుండి వసూలు చేయనున్నట్లు ప్రభుత్వం ఒక ప్రకటనలో వివరించింది. అమెరికా సుంకాల విధింపుపై తీవ్రంగా స్పందించిన చైనా అధికార మీడియా సంస్థ సిన్హువా అమెరికా బాధ్యతాయుతమైన ఆగ్రదేశంగా వ్యవహరిస్తూ, ఇటువంటి పిల్లచేష్ట లకు తెరదించాలని హితవుపలికింది.


తాజా ఫోటో గ్యాలరీ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/photo-gallery/