మరోసారి ప్రపంచ పటాలపై విరుచుకుపడ్డ చైనా

China
China

బీజింగ్‌: చైనా మరోసారి ప్రపంచ పటాలపై విరుచుకుపడింది. తమవిగా చెప్పుకుంటున్న భూభాగాలను వేరే దేశాలకు చెందినవిగా చూపించినందుకు గానూ మొన్న 30 వేల మ్యాప్‌లను చైనా ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. అయితే ఇపుడు తాజాగా మరో 3 లక్షలకు పైగా ప్రపంచ పటాలను ధ్వంసం చేసేందుకు సిద్ధమైంది. కాగా చైనాకు చుట్టుపక్కల అన్నిదేశాలతో భౌగోళిక సరిహద్దుల విషయంలో వివాదాలు నడుస్తున్నాయి. దీంతో అధికారులు తరచూ ఇక్కడ తయారయ్యే మ్యాప్‌లను పరిశీలించి మార్పులను సూచిస్తుంటారు. ఇలాగే గాంగ్‌డాంగ్‌ ప్రావిన్స్‌లోని వెంజిండు పోర్టులో ఇటీవల భారీగా ప్రపంచ పటాలను కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నెదర్లాండ్స్‌కు తరలించేందుకు సిద్ధం చేసిన ఈ మ్యాప్‌లను పరిశీలించగా.. అందులో అరుణాచల్‌ ప్రదేశ్‌ భారత భూభాగంగా, తైవాన్‌ స్వతంత్ర దేశంగా ఉంది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన అధికారులు మ్యాప్‌లను ముద్రించిన సంస్థపై దాడి చేశారు. మొత్తం ఇలాంటి 3,06,057 మ్యాప్‌లను గుర్తించారు. వీటిని వెంటనే ధ్వంసం చేయాలని కస్టమ్స్‌ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. త్వరలోనే వీటిని ధ్వంసం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అంతేగాక.. ప్రపంచ పటాలను ముద్రించిన సంస్థపై దావా వేసేందుకు చైనా నిర్ణయించింది.

మరిన్ని తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/