సముద్రం నుండి చైనా రాకెట్‌ ప్రయోగం

China launches rocket
China launches rocket


బీజింగ్‌: చైనా షిప్‌ నుండి రాకెట్‌ ప్రయోగాన్ని విజయవంతంగా ప్రయోగించింది. అయితే చైనా ఇటువంటి ప్రయోగం చేయడం ఇదే తొలిసారి. ఎల్లో సముద్రం నుండి ఈ ప్రయోగాన్ని చేపట్టింది. లాంగ్‌ మార్చ్‌ 11 రాకెట్‌ ద్వారా మొత్తం ఏడు శాటిలైట్స్‌ను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టింది. వీటిలో ఒకటి సముద్ర ఉపరితల గాలుల, తుఫాన్ల అధ్యయనానికి సంబంధించిన శాటిలైట్‌ కాగా మరో రెండు కమ్యూనికేషన్‌ శాటిలైట్స్‌ ఉన్నాయి. అయితే చైనా 2030 నాటికి అమెరికాను అందుకోవడంతో పాటు అంతరిక్షరంగంలో ప్రముఖ స్థానంగా నిలవాలనుకుంటుంది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/