ఉగ్రసంస్థలకు చైనా విరివిగా సాయం!

న్యూఢిల్లీ, : పాక్ ఉగ్రవాదంపై ఇండియా యుద్ధం చేస్తోంటే, మరోవైపు పాకిస్థాన్‌కు చైనా మోరల్ సపోర్ట్‌తో పాటు ఆర్థికంగా కూడా సహకరిస్తుంది. నిధులను నేరుగా కాకుండా చైనా ఉత్పత్లు ద్వారా పాక్ ఉగ్రవాదులకు నిధులు అందేలా చూస్తోంది. ఈ నేపథ్యంలోనే చైనీస్ ఉత్పత్తులు భారతదేశంలోకి హావాల మార్గంలో ప్రవేశిస్తున్నాయని ట్రేడర్స్ బాడీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆరోపిస్తోంది. అక్రమ ఉత్పత్తుల ద్వారా వచ్చిన నిధులను ఉగ్రవాద కార్యకలాపాలకు మళ్లిస్తున్నారని చెబుతోంది. దీంతో పాటు అక్రమ మార్గంలో వస్తున్న ఉత్పత్తుల వల్ల కూడా భారత ఖజానాకు భారీ రెవెన్యులోటు వస్తుందని పేర్కొంది. ఈ విషయాన్ని ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకోవాలని సిఎఐటి వెల్లడించింది. చైనా దిగుమతులపై ఉక్కుపాదం మోపేందుకు ఇండియన్ పోర్ట్‌ల వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేయాలని కోరుతోంది. కాగా చైనా నుంచి దిగుమతయ్యే వస్తువులను ఇన్ వాయిస్‌లో తక్కువ చూపించి, ఉగ్రవాదానికి నిధులు అందిస్తున్నాయని సిఎఐటి ఆరోపించింది. తక్కువ దిగుమతి సుంకం, తక్కువ జిఎస్టి వర్తించేలా వచ్చే చాలా కేసుల్లో, దిగుమతి చేసుకున్న అసలుతో మెటిరీయల్ సరిపోలడం లేదని సిఎఐటి చెబుతోంది. దీంతో చైనా నుంచి దిగుమతి చేసుకునే వస్తువుల్లో మెటిరియల్తోపాటు డాక్యుమెంట్ల పరిశీలనను చేపట్టాల్సి ఉందని వారు కోరుతున్నారు.
https://www.vaartha.com/news/international-news/
మరిన్ని తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: