పాక్‌లో చైనా బిలియన్‌ డాలర్లు పెట్టుబడి

pakistan-china
pakistan-china

చైనా: ఉగ్రవాదాన్ని నియంత్రించాలంటూ ప్రపంచ దేశాలన్నీ పాకిస్థాన్ పై ఒత్తిడి పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో తన వ్యాపార కార్యకలాపాలను దృష్టిలో ఉంచుకుని చైనా మాత్రమే పాకిస్థాన్ కు అండగా ఉంటోంది. ఈ క్రమంలో తాజాగా చైనా మరో కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్ సంక్షేమ ప్రాజెక్టుల్లో ఒక బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడుతున్నట్టు ప్రకటించింది. చైనాపాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ సంతృప్తికరంగా ఉన్న నేపథ్యంలో, మరిన్ని పెట్టుబడులు పెట్టబోతున్నామని చైనా రాయబారి యవో జింగ్ తెలిపారు. పాక్ లో ఉన్న వ్యాపార అవకాశాలపై అవగాహన కల్పించేందుకు పాక్ మహిళా వ్యాపారవేత్తలకు చైనాలో వర్క్ షాప్ లను నిర్వహించబోతున్నట్టు చెప్పారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/