ఈ ఒప్పందానికి ఇరు దేశాధినేతలు కట్టుబడి ఉండాలి

kim-trump
kim-trump

చైనా: ఉత్తరకొరియా, అమెరికా మధ్య సింగపూర్‌లో జరిగిన ఒప్పందానికి ఇరు దేశాధినేతలు కట్టుబడి ఉండాలని చైనా హితవు పలికింది. శాంతి స్థాపన, అణు నిరాయుధీకరణ దిశగా నిర్మాణాత్మకమైన చర్యలు తీసుకోవాలని సూచించింది. చైనా అధికారిక మీడియా సంస్థకు ఆ దేశ విదేశాంగ మంత్రి వాంగ్‌ యీ ఇచ్చిన ఇంటర్వ్యులో ఈ వ్యాఖ్యలు చేశారు. 2018లో ఉత్తరకొరియాఅమెరికా మధ్య జరిగిన ఒప్పందానికి అనుగుణుంగా ఇరు దేశాలు ఎటువంటి ప్రభావవంతమైన చర్యలు తీసుకోలేదని అభిప్రాయపడ్డారు. ఇప్పటికైనా నాటి సంయుక్త ప్రకటనకు అనుగుణంగా ఇరు దేశాధినేతలు ప్రణాళికలు రచించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/