పాకిస్థాన్‌కు చైనా భారీ షాక్‌!

China Flag
China Flag

చైనా:పాకిస్థాన్‌కు భారీ షాక్‌ తగిలింది. కశ్మీర్‌ విభజన, ఆర్టికల్‌ 370 రద్దుపై జోక్యానికి చైనా నిరాకరించింది. కశ్మీర్‌ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని తక్షణమే స్పందించాలని చైనాను పాకిస్థాన్‌ కోరింది. ఈ మేరకు పాక్‌ విదేశాంగ మంత్రి ఖురేషీ చేసిన విజ్ఞప్తిని చైనా తోసిపుచ్చింది. సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని, దక్షిణాసియాలో శాంతి సామరస్యాలు ఉండేలా చూడాలని, ఇరుదేశాలకు విజ్ఞప్తి మాత్రమే చేయగలమని చైనా సృష్టం చేసింది. కశ్మీర్‌ విషయంలో కనీసం చైనా అయినా మద్దతిస్తుందని భావించిన పాకిస్థాన్‌ ఆశలు గల్లందు అయ్యాయి.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/