అమెరికా చర్యలు ఏకపక్షంగా ఉన్నాయి

Chinese Foreign Ministry spokesman Geng Shuang
Chinese Foreign Ministry spokesman Geng Shuang

బీజింగ్‌: అమెరికా ఇరాన్‌పై విధించిన ఆంక్షలపై చైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇరాన్‌ ఆంక్షలపై చైనా విదేశాంగ అధికార ప్రతినిధి జెంగ్‌ షాంగ్‌ అమెరికా తీరును తీవ్రంగా విమర్శించారు. 2015లో ఇరాన్‌తో కుదుర్చుకున్న న్యూక్లియర్‌ ఒప్పందం నుంచి అమెరికా ఏకపక్షంగా తప్పుకోవడమేగాక కొత్త ఒప్పందం కుదుర్చుకోవాలని ఒత్తిడి చేయడం సమంజసం కాదని పేర్కొన్నారు.అమెరికా చర్యలు ఏకపక్షంగా ఉన్నాయన్నారు. ఇందుకు ఒప్పుకోకపోవడంతో ఆంక్షలు విధించి ఇరాన్‌ను తీవ్ర ఇబ్బందులకు గురిచేయడం సరికాదన్నారు. అయితే ఇరాన్‌పై అమెరికా విధించే అంక్షలపై చైనా స్పందించడం ఇదే మొదటిసారి.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/