అమెరికా సైనిక పర్యటన పై చైనా తీవ్ర ఆగ్రహం

US aircraft carrier
US aircraft carrier

చైనా: అమెరికాకు చెందిన యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు హాంకాంగ్‌ను సందర్శించటంపై చైనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హాంకాంగ్‌లో హింసాత్మక నేరాలకు పాల్పడుతున్న వేర్పాటు వాద ముఠాలను ప్రోత్సహించే అమెరికా స్వచ్ఛంద సంస్థలపై ఆంక్షలు విధిస్తున్నట్లు చైనా ప్రభుత్వం ప్రకటించింది. చైనా విదేశాంగశాఖ ప్రతినిధి హువా చున్యింగ్‌ మీడియాతో మాట్లాడుతూ హాంకాంగ్‌ నిరసనకారులను సమర్థిస్తూ అమెరికా గత వారం చట్టాన్ని ఆమోదించినందుకు ప్రతిగా తాము ఈ ఆంక్షలను విధిస్తున్నట్లు చెప్పారు. దీనితో పాటు హాంకాంగ్‌కు అమెరికా సైనిక పర్యటనలను నిరవధికంగా సస్పెండ్‌ చేస్తున్నామని, దీనికి సంబంధించి త్వరలోనే తదుపరి చర్యలు ప్రకటిస్తామని ఆమె వివరించారు. అమెరికా ప్రభుత్వం తన చర్యలు సరిదిద్దుకుని మా అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకోవటాన్ని నిలిపివేయాలి. హాంకాంగ్‌ శాంతి, సుస్థిరతలను, చైనా సౌర్వభౌమత్వాన్ని పరిక్షించుకునేందుకు అవసరమైతే మరిన్ని చర్యలు తీసుకుంటామని ఆమె సృష్టం చేశారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/