కోర్టు ముందుకు నరమేధం సృష్టించిన దుండగుడు

shootings at mosques in New Zealand
shootings at mosques in New Zealand

క్రైస్ట్‌చర్చ్‌: న్యూజిలాండ్‌లోని మసీదుల్లో శుక్రవారం విచక్షణారహితంగా కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. అయితే ఆ నరమేధం సృష్టించిన దుండగుడు బ్రెంటన్‌ టారంట్‌ను ఈరోజు కోర్టులో హాజరుపరచారు. మసీదుల్లో సృష్టించిన మారణహోమానికిగాను అతడిపై పోలీసులు హత్యారోపణల కింద కేసు నమోదు చేశారు. నిందితుడు బెయిల్‌కు అభ్యర్థించకపోవడంతో విచారణ నిమిత్తం ఏప్రిల్‌ 5వరకు రిమాండ్‌ విధించారు. ఖైదీ దుస్తులు, చేతులకు బేడీలు వేసి పటిష్ఠ భద్రత మధ్య నిందితుడిని పోలీసులు కోర్టుకు తీసుకువచ్చారు. అతడిని దారుణంగా శిక్షించాలంటూ బాధిత కుటుంబ సభ్యులు కోర్టు ముందు నినాదాలు చేశారు.


మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/