చారిత్రక ఘట్టానికి సర్వం సిద్ధ0

Chandrayan final stage
Chandrayan final stage

Sriharikota: చంద్రయాన్-2 చారిత్రక ఘట్టానికి సర్వం సిద్ధమైంది. జులై 22న ‘చంద్రయాన్-2’ శ్రీహరి కోటనుండి నింగిలోకి దూసుకుపోగా అప్పటి నుండి చంద్రుడివైపు ప్రయాణం సాగించింది. తొలుత భూకక్ష్యలోకి చేరి క్రమంగా చంద్రుడివైపు పయనమైంది. ఈనెల 2న ఆర్బిటర్ నుండి విడిపోయిన విక్రమ్ ల్యాండర్ చంద్రుడి చుట్టూ పరిభ్రమిస్తూ కక్ష్యను తగ్గించుకుంటూ చంద్రుడికి దగ్గరైంది. సుదీర్ఘ ప్రయాణం చేసి చంద్రుడి ఉపరితలానికి చేరువైంది. ప్రతివిన్యాసాన్ని అత్యంత ఖచ్చితత్వంతో పూర్తిచేసిన వ్యోమనౌకలోని విక్రమ్ ల్యాండర్ రేపు తెల్లవారుజామున జాబిలిపై కాలుమోపనుంది. ఈ అపురూప దృశ్యాన్ని చూసేందుకు భారత్ తో పాటు ప్రపంచ దేశాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. వ్యోమనౌక చేపట్టే నూతన ఆవిష్కరణపై ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తుండగా ఈ అద్భుత ఘట్టంతో భారత్ కూడా అమెరికా, రష్యా, చైనా సరసన చేరనుంది. ఇతర గ్రహాలూ, ఖగోళ వస్తువులపై వ్యోమనౌకలు దించేందుకు ఈ ఘట్టంతో మార్గం సుగమం కానుంది. ఈ విజయంతో జాబిలి దక్షణ ధ్రువంపైకి ప్రయోగం చేపట్టిన తొలిదేశంగా భారత్ నిలవనుంది.