ఇస్రోతో నాసా ఒప్పందం!


శక్తిమంతమైన రేడియో ఫ్రీక్వెన్సీ తరంగాలను చంద్రుడిపైకి పంపిన నాసా

ISRO-NASA
ISRO-NASA

బెంగళూరు: చంద్రయాన్2లో భాగంగా చంద్రుడి ఉపరితలంపై సాఫీగా దిగాల్సిన విక్రమ్ ల్యాండర్, బలంగా గుద్దుకోవడంతో దాన్నుంచి సంకేతాలు నిలిచిపోయాయి. ఈ పరిణామం ఇస్రో వర్గాలను ఆందోళనకు గురిచేసింది. ఈ నేపథ్యంలో, ఇస్రోతో కుదిరిన ఒప్పందం మేరకు నాసా రంగంలోకి దిగింది. చంద్రుడిపై అచేతనంగా పడివున్న విక్రమ్ ల్యాండర్ లో కదలిక తెచ్చేందుకు నాసా భారీ టెక్నాలజీని ఉపయోగిస్తోంది.

కాలిఫోర్నియాలోని నాసా జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీ (జేపీఎల్) తమ డీప్ స్పేస్ నెట్ వర్క్ కేంద్రాల నుంచి విక్రమ్ ల్యాండర్ కు శక్తిమంతమైన రేడియో ఫ్రీక్వెన్సీ తరంగాలను పంపిస్తోంది. 24 బీమ్స్ 12 కిలోవాట్ల శక్తితో కూడిన రేడియో ఫ్రీక్వెన్సీని చంద్రుడి ఉపరితలంపైకి పంపగా, అది తిరిగి భూమిని చేరిందని నాసా వర్గాలు తెలిపాయి. విక్రమ్ ల్యాండర్ జీవితకాలం కేవలం 14 రోజులు మాత్రమే. ల్యాండర్ ను సూర్యకిరణాలు మరి కొన్నిరోజుల పాటు మాత్రమే తాకుతాయి. ఈ లోపే సోలార్ ప్యానెళ్లను చార్జ్ చేస్తే తప్ప విక్రమ్ ల్యాండర్ ఉత్తేజం పొందదు. ఈ అంశమే ఇస్రో వర్గాలను ఎక్కువగా ఆందోళనకు గురిచేస్తోంది.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/