నిద్రలోనే కారు డ్రైవింగ్‌..!

car
car

వాషింగ్టన్‌: కారు గంటకు 60 కిలోమీటర్ల వేగంతో వెళుతూ, డ్రైవర్‌తో పాటు, అతని పక్కన ఉన్న మరో వ్యక్తి కూడా ఆదమరచి నిద్రపోతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. అమెరికాలోని మసాచుసెట్స్‌ న్యూటన్‌ హైవే మీద జరిగిందీ ఘటన. కారులోని డ్రైవర్‌, ఇంకో వ్యక్తి నిద్రపోతున్న వేళ, పక్కనే ఓవర్‌ టేక్‌ చేయబోయేందుకు వచ్చిన మరో కారు డ్రైవర్‌ వీరిని గమనించి, వీడియో తీసి సోషల్‌ మీడియాలో పెట్టాడు. కారులోని వారిని అలర్ట్‌ చేయాలని హారన్‌ మోగించినా, వారు లేవలేదు. వారు నిద్రపోతుండటాన్ని చూసి కంగారుపడిన అతను ఎంత అలసిపోయి ఉంటే మాత్రం ఇలా డ్రైవింగ్‌ చేస్తున్నప్పుడు నిద్రపోతారా అన్న కామెంట్‌తో వీడియోను పోస్ట్‌ చేశాడు. ఈ వీడియోకు టెస్లా సంస్థ స్పందించింది. తమ కార్లలో ఆటోపైలట్‌ ఫంక్షన్‌ ఉందని, అయినప్పటికి డ్రైవర్‌ అప్రమత్తత అవసరమని తెలిపింది. ఏదైనా హైవేపై వెళుతున్న వేళ, స్టీరింగ్‌పై చేతులు లేకుంటే నిమిషానికి రెండుసార్లు ప్రమాద సూచనలు వస్తాయని పేర్కొంది.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.. https://www.vaartha.com/news/international-news/