అమెరికాలో బోటు ప్రమాదం…20 మృతదేహాల వెలికితీత

  • నీటిలో పడవ శిథిలాల కింద మరో ఆరు మృతదేహాలు
dive boat fire accide
dive boat fire accide

కాలిఫోర్నియా: అమెరికాలోని కాలిఫోర్నియా తీరంలో జరిగిన బోటు ప్రమాదంలో 34 మంది ప్రయాణికులు గల్లంతు కాగా, ఇప్పటి వరకు 20 మృతదేహాలను అధికారులు వెలికి తీశారు. ఉత్తర కాలిఫోర్నియా సమీపంలోని శాంతాక్రూజ్ దీవి తీర ప్రాంతానికి సమీపంలో సోమవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. స్కూబా డైవ్ చేసే వాణిజ్య పడవలో మంటలు చెలరేగినట్టు అమెరికా తీర రక్షక దళం తెలిపింది. గల్లంతైన వారి కోసం సహాయక చర్యలు చేపట్టిన రెస్క్యూ సిబ్బంది ఇప్పటి వరకు 20 మృతదేహాలను వెలికి తీశారు. మరో నాలుగు నుంచి ఆరు మృతదేహాలు నీటిలో బోటు శిథిలాల కింద చిక్కుకుపోయి ఉంటాయని భావిస్తున్నారు. మృతదేహాలకు డీఎన్ఏ పరీక్ష నిర్వహించిన అనంతరం వారిని గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించనున్నట్టు శాంతా బార్బారా కౌంటీ షరీఫ్ బిల్ బ్రౌన్ తెలిపారు.


తాజా ఫోటో గ్యాలరీ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/photo-gallery/