గ్రీన్‌ కార్డు స్థానంలో ‘బిల్డ్‌ అమెరికా’ వీసా

Donald Trump
Donald Trump

  కేటాయింపునకు ప్రతిభ ఆధారిత పాయింట్ల పద్ధతి
నైపుణ్య కోటా 12 నుంచి 57 శాతానికి పెంపు
   కొత్త విధానాన్ని ప్రతిపాదించిన అధ్యక్షుడు ట్రంప్‌
వేల మంది భారతీయ నిపుణులకు ప్రయోజనం

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆ దేశంలో వలసలకు సంబంధించి ఒక కొత్త విధానాన్ని తీసుకోచ్చారు. ప్రతిభ, పాయింట్ల ఆధారిత ఇమిగ్రేషన్‌ విధానాన్ని తెరపైకి తెచ్చారు. ప్రస్తుత గ్రీన్‌ కార్డుల స్థానంలో ఖబిల్డ్‌ అమెరికాగ వీసాలను ప్రతిపాదించారు. ఆయన వైట్‌హౌస్‌లోని రోజ్‌ గార్డెన్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ విధానాన్ని ప్రకటించారు. యువత, అత్యంత నైపుణ్యం కలిగిన ఉద్యోగులకు ఇచ్చే కోటాను 12 నుంచి 57 శాతానికి పెంచారు. దీనివల్ల భారత్‌కు చెందిన వేల మంది నిపుణులకు ప్రయోజనం కలిగే అవకాశం ఉంది.ఏటా కేటాయించే గ్రీన్‌కార్డుల సంఖ్యలో ఎలాంటి మార్పునూ వైట్‌హౌస్‌ ప్రణాళిక ప్రకటించలేదు. ప్రస్తుతం చాలావరకూ కార్డులను కుటుంబ సంబంధాలు, ఖభిన్నత్వ వీసాగ ఆధారంగా జారీచేస్తున్నారు. వృత్తి నిపుణులు, అత్యంత ఎక్కువ నైపుణ్యం కలిగిన వారికి చాలా తక్కువ స్థాయిలోనే వీసాలు ఇస్తున్నారు.ప్రస్తుత చట్టబద్ధ ఇమిగ్రేషన్‌ విధానం లోపభూయిష్టంగా ఉందని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అద్భుత నైపుణ్యాన్ని ఆకర్షించడంలో అది విఫలమైందని ట్రంప్‌ పేర్కొన్నారు. ప్రస్తుత విధానం కొత్తగా వచ్చిన అమెరికన్ల సమీప బంధువులు, భార్య/భర్త, సంతానానికి ప్రాధాన్యత ఇస్తోందని ట్రంప్‌ పేర్కొన్నారు. ఇప్పటివరకూ మేధస్సుపై మనం వివక్ష చూపాం. తాజా ప్రతిపాదనలకు చట్టసభ ఆమోదం లభించాక అలాంటి పరిస్థితి ఉండదు. అత్యంత ప్రతిభ కలిగిన విద్యార్థులు, ఉద్యోగులు అమెరికాలోనే ఉండి, బాగా వృద్ధిలోకి రావాలని కోరుకుంటున్నాంగగ అని ఆయన చెప్పారు. అర్థంపర్థంలేని ప్రస్తుత విధానం వల్ల ఒక వైద్యుడికి, పరిశోధకుడికి, ప్రపంచంలోనే అత్యంత అద్భుత కళాశాల నుంచి నంబర్‌ వన్‌ స్థానంతో చదువు పూర్తి చేసుకున్న విద్యార్థికి ప్రాధాన్యం ఇవ్వలేకపోతున్నామన్నారు. ఈ లోపభూయిష్ట నిబంధనల ఫలితంగా వార్షిక గ్రీన్‌ కార్డుల ద్వారా చాలావరకూ తక్కువ వేతనం, పరిమిత నైపుణ్యమున్న వారే వలస వస్తున్నారు. అలాంటి వారు ఉద్యోగాల విషయంలో అత్యంత దుర్బల అమెరికన్లతో పోటీపడుతున్నారు. మన సామాజిక భద్రత, ఉదార సంక్షేమ కార్యక్రమాలపై భారం మోపుతున్నారు అని పేర్కొన్నారు.


మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/