అమెరికాలో ‘బాంబ్‌’ తుఫాను భీభత్సం

bomb cyclone
bomb cyclone


వాషింగ్టన్‌: అమెరికాలో బాంబు తుఫాను భీభత్సం సృష్టిస్తుంది. నెల రోజుల వ్యవధిలోనే రెండోసారి వచ్చిన తుఫానుతో దక్షిణ డకౌటాలో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగింది. వాతావరణ పీడనాల్లో ఆకస్మిక తగ్గుదల వల్ల తుఫాను వేగంగా బలపడుతుందని అధికారులు తెలిపారు. రెండు అడుగుల మేర మంచు పేరుకుపోవడంతో రవాణాకు, ప్రయాణానికి తీవ్ర ఇబ్బందిగా ఉంది. తుఫాను కారణంగా మిన్నెసోటా, విస్కాన్సిస్‌, నెబ్రాస్కా, దక్షిణ డకోటా వంటి ప్రాంతాలు మంచు ప్రమాదంలో చిక్కుకున్నాయి. గంటకు 80 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు.

తాజా ఎన్నారై వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/nri/