కాబుల్‌లోని అమెరికా రాయబార కార్యాలయం వద్ద పేలిన రాకెట్‌

rocket blast
rocket blast


కాబూల్‌: ఆఫ్ఘనిస్తాన్‌లోని అమెరికా రాయబార కార్యాలయం వద్ద ఒక రాకెట్‌ పేలింది. 9/11 అమెరికాపై దాడులు జరిగిన నేటికి 18 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో పేలిన ఈ రాకెట్‌ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాకెట్‌ పేలుడులో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని ఇక్కడి అధికారులు తెలిపారు. సెంట్రల్‌ కాబూల్‌లో ముందుగా దట్టమైన పొగ రాగానే సైరన్‌ మోగిందని, సైరన్‌ను లౌడ్‌ స్పీకర్‌ ద్వారా విన్నట్లు అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులు అన్నారు. అయితే ఈ ఘటన జరిగిన వెంటనే అధికారుల నుంచి ఎలాంటి ప్రకనటన వెలువడలేదున్నారు.

దగ్గరలో ఉన్న నాటో మిషన్‌ అధికారులు కూడా ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని నిర్ధారించారన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అమెరికా తాలిబన్‌ల మధ్య చర్చలు ఇక ఉండవని, వారిపై సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న దాడులను నిలిపివేయాలని నిర్ణయించిన తరువాత జరిగిన తొలి ఘటన. గతవారం రెండు తాలిబన్‌ కారు బాంబులు కాబుల్‌లో విధ్వంసం సృష్టించాయి. ఈ పేళ్లలో చాలా మంది మృతి చెందారు. నాటో మిషన్‌పై ఉన్న ఇద్దరు అధికారులు ఈ ప్రమాదంలో అసువుబాసారు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/news/international-news/