రష్యాలోని ఆర్కిటిక్ క్షిపణి కేంద్రంలో పేలుడు

blasting

Moscow: : రష్యాలోని ఆర్కిటిక్ క్షిపణి కేంద్రంలో పేలుడు సంభవించి ఐదుగురు చనిపోయినట్లు సమాచారం. అయితే చనిపోయింది అయిదుగురు కాదని ఇద్దరేనని సైనికాధికారులు చెబుతున్నారు. ఎంతమంది చనిపోయారో ఎవరూ ధృవీకరించడంలేదు. రాకెట్ ఇంజిన్ కు పరీక్షలు నిర్వహిస్తుండగా పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. ఈ పేలుడు తరువాత రేడియేషన్ బాగా పెరిగినట్లు కొందరు అధికారులు చెబుతున్నారు.