ట్రంప్‌పై వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా!

Bill de Blasio
Bill de Blasio

వాషింగ్టన్‌: వచ్చే సంవత్సరం జరగనున్న అమెరికా అధ్యక్షత ఎన్నికల్లో తాను పోటీ చేయనున్నట్లు డెమోక్రటిక్‌ పార్టీనేత, న్యూయార్క్‌ మేయర్‌ బిల్‌డే బ్లాసియో వెల్లడించారు. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ని గద్దెదింపడమే తన లక్ష్యమని ఆయన తెలిపారు. నా స్వస్థలం న్యూయార్క్‌. నా రాజకీయ ప్రస్థానం ఇక్కడే మొదలైంది. ట్రంప్‌తో తలపడే సత్తా నాలో ఉంది. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నా. మీ అందరి సహకారం ఉంటే కచ్చితంగా ట్రంప్‌పై గెలుస్తాను. నా తొలి ప్రచారం లోవా, దక్షిణ కరోలినా నగరాల నుంచి ప్రారంభించాలని నిర్ణయించుకున్నాను అని బిల్‌డె బ్లాసియో అన్నారు.


మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/