16.3 లక్షల కోట్ల డాలర్లతో హరిత ప్రణాళిక

Bernie Sanders
Bernie Sanders

అమెరికా: అమెరికాలో ఉన్న కాలుష్య తీవ్రతను తగ్గించేందుకు తాను ఒక ప్రణాళికను రూపొందించినట్టు అధ్యక్ష పదవి రేసులో ఉన్న డెమోక్రటిక్‌ పార్టీ నేత బెర్నీ శాండర్స్‌ వెల్లడించారు. ఇందుకోసం 16.3 లక్షల కోట్ల డాలర్లు వెచ్చించనున్నట్లు తెలిపారు. దీని ద్వారా 2030లోగా దేశంలో 100 శాతం విద్యుత్‌ను పునరుత్పాదక శక్తుల నుంచి ఉత్పత్తి చేయవచ్చునని పేర్కొన్నారు. 2050 నాటికి దేశాన్ని కర్బన్‌ రహిత ప్రాంతంగా మార్చుకునే అవకాశం ఉందన్నారు. 10 సంవత్సరాల కాలానికి సంబంధించి తాను రూపొందించిన ఈ ప్రణాళిక గ్రీన్‌ న్యూ డీల్‌ (నూతన హరిత ప్రణాళిక) అని నామకరణం చేశామన్నారు. వలసల అంశం నుంచి విదేశీ విధానాల వరకూ అన్ని అంశాలపై ఇది ప్రభావం చూపుతుందన్నారు. తమ ప్రణాళిక ద్వారా దాదాపు 2 కోట్ల నూతన ఉద్యోగాలు సృష్టించగలుగుతామని హామీ ఇచ్చారు.


తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/