బీరూట్‌ పేలుళ్లు ..135కి చేరిన మృతులు

beirut explosion

బీరూట్‌: లెబ‌నాన్ రాజ‌ధాని బీరూట్‌లో జ‌రిగిన ప్ర‌మాదంలో మృతిచెందిన వారి సంఖ్య 135కు చేరుకున్న‌ది. న‌గ‌రంలోని ఓడ‌రేవులో నిల్వ ఉన్న అమ్మోనియం నైట్రేట్ పేల‌డం వ‌ల్ల భారీ విధ్వంసం జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో గాయ‌ప‌డ్డ‌వారి సంఖ్య నాలుగు వేలు దాటింది. రెండు వారాల పాటు దేశంలో ఎమ‌ర్జెన్సీ విధించారు. 2750 ట‌న్నుల అమ్మోనియం నైట్రేట్‌ను నిల్వ ఉంచ‌డం వ‌ల్లే ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు అధ్య‌క్షుడు మైఖేల్ ఆవాన్ తెలిపారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/