ప్రపంచంలోనే అతిపెద్ద నివాస భవనం!

Vienna's Karl Marx Hof
Vienna’s Karl Marx Hof

వియాన్నా: ‘కార్ల్‌ మార్క్స్‌ హాఫ్‌’ ఇది ప్రపంచంలోనే అతిపెద్ద నివాస సమాదాయం. ఆస్ట్రీయా రాజధాని వియన్నాలో ఉన్న ఈ పొడవాటి భవనాన్ని 1927-1930ల మధ్య కాలంలో నిర్మించారు. ఈ భవనం ఏకంగా 1100 మీటర్ల పొడవు ఉంటుంది. అంటే కిలోమీటరుకు పైనే ఉంటుంది. మొత్తం భవనాన్ని అంతా ఒకే ఫటోలో చూడలేము. ఇందులో సుమారు 1300లకు పైగా అపార్ట్‌మెంట్లు ఉన్నాయి. ఐదు వేల కుంటుంబాలు నివాసం ఉంటున్నాయి. అయితే ఈ భవనం అప్పట్లో వియన్నా సోషనల్‌ డెమోక్రటిక్‌ పార్టీ ఆఫ్‌ వియన్నా అధీనంలో ఉండేది.ప్రజల నుంచి ప్రత్యేకమైన పన్నులు వసూలు చేసి మరీ దీనిని నిర్మించారు. మొదటి ప్రపంచ యుద్ధం వల్ల వేలాది ఇళ్లు ధ్వంసం కావడంతో బాధితులకు ఇందులో నివాసాలు కల్పించేందుకు ఖకార్ల్‌ మార్క్స్‌హాఫ్‌గను నిర్మించారు. అదే ప్రపంచంలోనే అతిపొడవైన నివాస సముదాయంగా చరిత్రలో నిలిచిపోయింది.

మరిన్ని తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/